గ్రీన్‌ప్లై బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ Junior NTR as Greenfly Brand Ambassador | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ప్లై బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌

Published Tue, Sep 12 2023 6:48 AM

Junior NTR as Greenfly Brand Ambassador - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హానికారక ఉద్గారాలను తగ్గించే జీరో ఎమిషన్‌ ప్లైవుడ్‌ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నటుడు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ను నియమించుకున్నట్లు గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్‌ (జీఐఎల్‌) సీఈవో మనోజ్‌ తుల్సియాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త వాణిజ్య ప్రచార ప్రకటనలను రూపొందించినట్లు చెప్పారు.

ప్రస్తుతం దేశీయంగా ప్లైవుడ్‌ పరిశ్రమ 4.5 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, అందులో సంఘటిత రంగం వాటా 30 శాతం వరకు ఉంటుందని సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల వరకు అంచనా వేస్తున్నట్లు మనోజ్‌ చెప్పారు.

ప్రస్తుతం తమకు గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎండీఎఫ్, ప్లైవుడ్‌ తయారీ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. టర్కీకి చెందిన సంస్థతో జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు చేస్తున్న ప్లాంటు వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని మనోజ్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement