ఈఈఎస్‌ఎల్‌తో జియోథింగ్స్‌ ఒప్పందం

Jio partners with EESL to provide 1 million smart prepaid meters in Bihar - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు కోసం ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ (ఈఈఎస్‌ఎల్‌)తో జియోథింగ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్రెంచ్‌ సంస్థ ఈడీఎఫ్‌తో కలిసి బిహార్‌లో తమ స్మార్ట్‌ యుటిలిటీ ప్లాట్‌ఫాం సొల్యూషన్‌ ఆధారిత 10 లక్షల స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయనుంది.

తాజా స్మార్ట్‌ సాంకేతికల వినియోగం ద్వారా విద్యుత్‌ రంగం లబ్ధి పొందేందుకు తమ స్మార్ట్‌ యుటిలిటీ ప్లాట్‌ఫాం ఉపయోగపడగలదని జియో ప్లాట్‌ఫామ్స్‌ సీఈవో కిరణ్‌ థా మస్‌ తెలిపారు. కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్దేశించుకున్న 25 కోట్ల స్మార్ట్‌ మీటర్ల లక్ష్య సాకారం దిశగా ఈ ప్రయత్నాలు తోడ్పడగలవని పేర్కొన్నారు. విశ్వసనీయమైన విధంగా శక్తిపరమైన భద్రతను సాధించుకోవడంలో స్మార్ట్‌ మీటరింగ్‌ కీలకంగా ఉండగలదని ఈఈఎస్‌ఎల్‌ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top