భారత్‌లో అదరగొట్టిన ధంతేరాస్‌ సేల్స్‌, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం!

Jewellery Business Sale Worth Rs 25,000 Crore, China Loss Rs 75,000 Crore - Sakshi

ధంతేరాస్‌ దగదగలతో బంగారం వ్యాపారం జోరుగా సాగింది. కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న మార్కెట్‌ రెండు సంవత్సరాల తర్వాత తిరిగి పుంజుకుంది. వెరసి కేవలం రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.25 వేల కోట్ల బంగారం అమ్మకాలు జరిగాయి. ధంతేరాస్‌, దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 22, అక్టోబర్‌ 23న రూ. 45 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. 

బంగారం అమ్మకాలు రూ. 25 వేల కోట్లు ఉండగా మిగిలిన రూ. 20 వేల కోట్లకు ఆటోమొబైల్స్‌, కంప్యూటర్లు, కంప్యూరట్లకు సంబంధించిన ఇతర గాడ్జెట్స్‌, ఫర్నీచర్‌, హోమ్‌, ఆఫీస్‌ డెకరేషన్‌, స్వీట్లు అండ్‌ స్నాక్స్‌, కిచెన్‌ ఐటమ్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, మొబైల్‌ ఐటమ్స్‌ సేల్స్‌ జరిగాయి. 

నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ)..రెండు రోజుల పాటు జరిగిన ధంతేరాస్‌ పండుగ సందర్భంగా భారీ ఎత్తున గోల్డ్‌, కాయిన్స్‌, నోట్స్‌, శిల్పాలు, పాత్రల అమ్మకాలు సుమారు రూ. 25 వేల కోట్ల వరకు జరిగాయని తెలిపింది.  

చదవండి👉 పాక్‌ అభిమాని గూబ గుయ్‌మ‌నేలా..సుందర్‌ పిచాయ్‌ రిప్లయ్‌ అదిరింది

ఈ ఏడాది దీపావళి పండుగ విక్రయాలు దేశంలో రూ.1,50,000 కోట్లకు మించి ఉంటాయని సీఏఐటీ పేర్కొంది. ఈ పండుగలో మరో సానుకూల అంశం ఏమిటంటే, వినియోగదారులు భారతీయ వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. దీని ఫలితంగా చైనాకు వ్యాపారంలో రూ. 75,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. 

బంగారానికి డిమాండ్‌ పెరిగింది
ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్‌ సంక్షోభం మార్కెట్‌ నుంచి గోల్డ్‌ మార్కెట్‌ పూర్తిగా కోలుకుంది. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్‌ కారణంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 80% వరకు పెరిగింది. "2021తో పోలిస్తే 2022లో భారతదేశంలో బంగారం దిగుమతులు దాదాపు 11.72% తగ్గాయి. గత ఏడాది ప్రథమార్థంలో భారతదేశం 346.38 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఇప్పుడు అది 308.78 టన్నులను దిగుమతి చేసుకుంది. 

చదవండి👉 ‘భారతీయులకు అంత సీన్‌లేదన్నాడు..రిషి సునాక్‌ చేసి చూపించారు..’

ఏ ప్రొడక్ట్‌పై ఎంత సేల్‌ జరిగిందంటే
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా మాట్లాడుతూ.. ‘‘ధంతేరాస్‌, దీపావళి రోజు బంగారం బిజినెస్‌తో పాటు ఆటోమొబైల్ రంగంలో రూ. 6 వేల కోట్లు, రూ. 1500 కోట్ల ఫర్నిచర్, రూ. 2500 కోట్లు కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఎఫ్‌ఎంసీజీలో సుమారు రూ. 3 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు రూ. 1000 కోట్లు, స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడి పాత్రల అమ్మకాలు రూ. 500 కోట్లు, వంటగది ఉపకరణాలు, ఎక్స్‌టైల్, రెడీమేడ్ దుస్తులు, ఫ్యాషన్ దుస్తుల వ్యాపారం రూ. 700 కోట్ల వరకు జరిగింది.

చదవండి👉 ‘ఎలాన్‌ మస్క్‌కు ఊహించని షాక్‌’..ట్విట్టర్‌ ఉద్యోగుల వార్నింగ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top