IT Company Infogain To Hire Over 1,000-Plus People This Fiscal (FY24) - Sakshi
Sakshi News home page

ఈ ఐటీ కంపెనీ సూపర్‌! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్‌ నుంచే..

May 22 2023 8:32 AM | Updated on May 22 2023 9:20 AM

IT company Infogain to hire over 1000 people this fiscal - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఐటీ సంస్థ ఇన్ఫోగెయిన్‌ తమ మార్కెట్‌ను పెంచుకునే దిశగా డిజిటైజేషన్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా సిబ్బందిని తీసుకోనుంది. అలాగే సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

ఇన్ఫోగెయిన్‌ ప్రెసిడెంట్‌ దయాపత్ర నెవాతియా ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగుల తీసివేతలేమీ ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా రిక్రూట్‌ చేసుకునే వారిలో 800 మంది భారత్‌లోనే ఉండబోతున్నారని నెవాతియా వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కంపెనీకి 6,000 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 5,000 మంది భారత్‌లో పని చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement