
ఈ వారం ప్రారంభంలో యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ ఫోన్స్ కోసం ప్రీ-బుకింగ్‌లను భారతదేశంలో శుక్రవారం (సెప్టెంబర్ 12) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా దీనిని బుక్ చేసుకోవచ్చు. అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు మీరు ఐఫోన్ డెలివరీ పొందవచ్చు లేదా మీ నగరంలోని ఆపిల్ స్టోర్ నుంచి కూడా తీసుకోవచ్చు.
ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్స్.. ఎలా ఆర్డర్ చేయాలంటే..
●యాపిల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
●హోమ్ పేజీలోని మీ ఐఫోన్ 17 మోడల్‌ను ఎంచుకోండి.
●మీరు బుక్ చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్, స్టోరేజ్ వంటి వాటిని సెలక్ట్ చేసుకొండి.
●బుకింగ్స్ పూర్తి చేయడానికి కార్ట్‌కు జోడించి, చెక్అవుట్ మీద క్లిక్ చేయండి.
●ఆ తరువాత కార్డ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. లేదా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
●ఇవన్నీ పూర్తయిన తరువాత బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కంపెనీ డెలివరీ టైమ్‌లైన్‌ను షేర్ చేస్తుంది.
ఐఫోన్ 17 ధరలు
ఐఫోన్ 17
➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900
➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900
ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్
➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900
➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900
➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900
➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900
➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900
➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900
➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900
ఐఫోన్ 17 ఎయిర్
➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900
➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900
➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900
ఇదీ చదవండి: ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ