
యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌ను నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులోని ఎయిర్ వేరియంట్ ఓపెన్ఏఐ సీఈఓ 'సామ్ ఆల్ట్‌మన్'ను తెగ ఆకట్టుకుంది. దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
''చాలా కాలంగా నేను కోరుకుంటున్న మొదటి కొత్త ఐఫోన్ అప్‌గ్రేడ్ ఇది! చాలా బాగుంది'' అని యాపిల్ టెక్నాలజీని సామ్ ఆల్ట్‌మన్ ప్రశంసించారు. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్నని హ్యాండ్‌సెట్. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. 5.6 మిల్లీమీటర్ల మందం కలిగిన ఫ్రేమ్, కేవలం 165 గ్రాముల బరువు కలిగిన ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని ఐఫోన్.
గతంలో చాలామంది ఐఫోన్ ప్రియులు, విశ్లేషకులు.. కొత్త ఆవిష్కరణలు లేదని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ఎనిమిది సంవత్సరాలలో కంపెనీ ఆవిష్కరించిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచింది.
first new iphone upgrade i have really wanted in awhile! looks very cool.
— Sam Altman (@sama) September 9, 2025
ఐఫోన్17 ధరలు
టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభించే అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్‌ని కూడా యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 17 ధర 799 డాలర్ల నుంచి, ప్రో ధర 1,099 డాలర్లు, ప్రో మ్యాక్స్ ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.