మరో ఐదేళ్ల పాటు, ఇన్ఫోసిస్‌ సీఈవోగా సలీల్‌ పరేఖ్‌!

Infosys Re Appoints Salil Parekh as CEO, MD For 5 Years  - Sakshi

మరో 5ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవోగా సీఈఓ సలీల్‌ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జులై 1నుంచి  2027 మార్చి 31వరకు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు. ఇక ఎప్పటిలాగే  ఇన్ఫోసిస్‌ ఎక్స్‌ప్యాండ్‌ స్టాక్‌ ఓనర్‌ షిప్‌ -2019 ప్లాన్‌ లో భాగంగా ఆయనకు ఇన్ఫోసిస్‌ షేర్లను కట్టబెట్టనుంది. 

ఇన్ఫోసిస్‌ ప్రకటన 
మే 21న ఇన్ఫోసిస్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ కమిటీ(ఎన్‌ఆర్సీ) సభ్యులు సలీల్‌ పరేఖ్‌ను మళ్లీ సంస్థ సీఈవోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో పరేఖ్‌ ఈ ఏడాది జులై 1,2022 నుంచి మార్చి 31,2027వరకు పదవిలో ఉంటారని ఇన్ఫోసిస్‌ తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌ తెలిపింది. 

 

     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top