IT companies: గ్రాడ్యుయేట్స్‌కి బంపర్‌ ఆఫర్‌.. లక్షకు పైగా ఉద్యోగాలు

Indian IT companies looking to hire more than 1 lakh college graduates - Sakshi

దేశంలోని పలు టాప్‌ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీసీఎస్‌ 43వేల మంద్రి ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్స్‌ని నియమించుకోగా.. ఇప్పుడు మరో 35 వేల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీసీఎస్‌తో పాటు మిగిలిన టెక్‌ కంపెనీలు సైతం ఈ ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు ప్లాన్‌ చేస్తుండగా.. ఈ ఏడాది చివరి నాటికి మరో లక్షమందికి పైగా ఫ్రెషర్స్‌ ఉద్యోగ అవకాశాల్ని కల్పించనున్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ఆయా కంపెనీలు త్రైమాసిక ఆదాయాల గణాంకాల విడుదల సందర్భంగా ఫ్రెషర్స్‌ నియామకంపై స్పందించాయి. వర్చువల్‌ వర్క్‌ డిమాండ్‌ పెరగడంతో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ కంపెనీలు లక్షమందిని నియమించుకోనున్నట్లు తెలిపాయి. 

టీసీఎస్‌ నియామకాలు
గతవారం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సెకండ్‌ ఫైనాన్షియల్‌ ఇయర్‌ సందర్భంగా మరో 35వేల మంది ఫ్రెషర్స్‌ ను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 78వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లవుతుంది. టీసీఎస్‌ ఇప్పటికే గత ఆరునెలల్లో 43వేల మందిని ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది.  

ఇన్ఫోసిస్‌ నియామకాలు 
గతంలో ఇన్ఫోసిస్‌ 35వేల మందిని నియమించుంటున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. కానీ అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస సమస్య) రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) ప్రవీణ్‌ రావు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపల మరో 10వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు చెప్పారు.  
 
విప్రో నియామకాలు 
రెండో ఆర్ధిక సంవత్సరంలో (ఏప్రిల్‌, మే,జూన్‌) మొత్తం 8,100 ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌లను  క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్‌ చేసుకున్నట్లు విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్ చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మరో 25వేల మందిని ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. 

హెచ్‌సీఎల్‌ లో నియామకాలు 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సైతం ఈ ఏడాది చివరి నాటికి  20వేల నుంచి 22వేల మందిని, వచ్చే ఏడాదిలో మరో 30వేల మంది ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 

చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్‌లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top