
59.3కు పీఎంఐ
17 ఏళ్లలోనే వేగవంతమైన పురోగతి
తయారీ రంగం ఆగస్ట్‌లో అదరగొట్టింది. ఈ రంగంలో పనితీరును ప్రతిఫలించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 59.3కు చేరుకుంది. జూలైలో ఇది 59.1గా ఉంది. పదిహేడున్నరేళ్ల కాలంలోనే అత్యంత వేగవంతమైన విస్తరణను చూపించినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తెలిపింది. 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన నమోదైతే కుచించినట్టు పరిగణిస్తుంటారు.
‘భారత తయారీ రంగ పీఎంఐ ఆగస్ట్‌లో మరో కొత్త రికార్డును తాకింది. తయారీ శర వేగంగా విస్తరించడం ఫలితమే ఇది. భారత వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడం కొత్త ఎగుమతి ఆర్డర్లు కొంత తగ్గేందుకు దారితీసి ఉండొచ్చు. టారిఫ్‌ల అనిశ్చితుల మధ్య అమెరికా కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లకు దూరంగా ఉన్నారు’ అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. కొత్త ఆర్డర్ల రాక ఐదు నెలల కనిష్ట స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. కాకపోతే జూలై ఆర్డర్ల స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: వాహన విక్రయాలకు జీఎస్‌టీ 2.0 బ్రేకులు