Income Tax: ఐటీఆర్‌ 4 సుగమ్‌ కూడా రెడీ | income tax return itr 4 sugam guide | Sakshi
Sakshi News home page

Income Tax: ఐటీఆర్‌ 4 సుగమ్‌ కూడా రెడీ

May 25 2026 12:10 PM | Updated on May 25 2026 12:51 PM

income tax return itr 4 sugam guide

సుగమ్‌ దర్శనంలాగా సుగమ్‌ పోర్టల్‌లాగా సుగమ్‌ ఫారం. ఈ ఫారం నంబరు 4. సుగమ్‌ అనే పదానికి సులువు, సులభతరం అని అర్థంగా స్వీకరించాలి మనం. గత వారం సహజ్‌ గురించి తెలుసుకున్నాం. ఈ వారం సుగమ్‌ గురించి తెలుసుకుందాం.

ఎవరు దాఖలు చేయొచ్చు 
🔹 రెసిడెంటు వ్యక్తులు 
🔹 హిందూ ఉమ్మడి కుటుంబాలు 
🔹భాగస్వామ్య సంస్థలు 
ఏయే ఆదాయం  ఉన్న వారు వేయాలి 
🔹 జీతం లేదా పెన్షన్‌; రెండూ ఉన్న వాళ్లు 
🔹 రెండు ఇళ్ల మీద ఆదాయ ఉన్న వారు 
🔹 ఇతర ఆదాయాలు ఉన్న వారు. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ, ఫ్యామిలీ పెన్షన్‌ 
🔹 క్యాపిటల్‌ గెయిన్స్‌ – లాంగ్‌ – రూ. 1,25,000 దాటనివారు

🔹 కొన్ని సెక్షన్ల ప్రకారం లెక్కలు రాసి, వేసి కచ్చితంగా ఇంత లాభం/నష్టం అని నిర్ధారించరు. బదులుగా ఒక నిర్దేశిత శాతం లేదా నిర్దేశిత ఆదాయం అని లెక్కిస్తారు. దీన్నే ఊహాజనిత ఆదాయం అంటారు. ఇది మూడు రకాలు..  
(ఎ) టర్నోవరు రూ. 2 కోట్లు / నగదు వ్యవహారాలు 5 శాతం కన్నా తక్కువ ఉంటే రూ. 3 కోట్ల మీద, డిజిటల్‌ వసూళ్ల మీద 6 శాతం, మిశ్రమం అయితే 8 శాతం. వీళ్లు ఎటువంటి బుక్స్‌తో నిమిత్తం లేకుండా ఈ నిర్దేశిత శాతం మేరకు లాభాన్ని డిక్లేర్‌ చేసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారస్తుల కోసం ఉద్దేశించినది.  
(బి) నిర్దేశిత వృత్తి నిపుణులకు వారి వార్షిక టర్నోవరు రూ. 50,00,000 లోపల ఉంటే సగం, అంటే 50 శాతం లాభంగా డిక్లేర్‌ చేయొచ్చు. 95 శాతం వ్యవహారాలు డిజిటల్‌గా జరిగితే ఈ టర్నోవరు లిమిట్‌ రూ. 75,00,000 వరకు ఉంటుంది. 
(సి) వస్తువుల రవాణా చేసే వారికి, వారు నడిపే వాహనాల సంఖ్య 10 లోపల ఉంటేనే వర్తిస్తుంది. భారీ వాహనాల మీద టన్ను మోతకు రూ. 1,000 చొప్పున లెక్కిస్తారు. ఇతర వాహనాల మీద నెలకి రూ. 7,500.. టన్నుల మోతతో నిమిత్తం లేకుండా.  పైన చెప్పిన మూడు రకాల/వర్గాల వారికి ఆయా ఆంక్షలకు లోబడి వర్తింపచేస్తే, అకౌంటుతో సంబంధం లేకుండా ఆదాయం డిక్లేర్‌ చేయొచ్చు.  

ఎవరు ఈ నాలుగో నంబర్‌ ఫారం వేయకూడదంటే.. 
🔹 నాన్‌ రెసిడెంట్లు 
🔹 లిమిటెడ్‌ భాగస్వామ్యాలు 
🔹 కంపెనీ డైరెక్టరు 
🔹 అన్‌లిస్టెడ్‌ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం ఉన్న వారు 
🔹 వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటని వారు 
🔹 గత సంవత్సరం సర్దుబాటు నష్టాలను బదిలీ చేసే వారు 
🔹 విదేశీ ఆదాయం/ఆస్తులు ఉన్నవారు ఇప్పుడు తెలిసింది కదా ఎవరు వేయొచ్చు.. ఎవరు వేయకూడదో.. ఇక రెడీ అవ్వండి వేయడానికి ఈ విధంగా. 
🔹 మీరు పాత పద్ధతి/కొత్త పద్ధతి ఏదైనా ఎంచుకోవచ్చు 
🔹 ఆన్‌లైన్‌లో పోర్టల్‌ ద్వారా వేయొచ్చు 
🔹 ఆఫ్‌లైన్‌లో ఎక్సెల్, జెసన్‌ యుటిలిటీ ద్వారా వేయొచ్చు. టీడీఎస్‌ ఫారాలు, ఆదాయానికి, పన్నుకి సంబంధించిన డాక్యుమెంట్లు, సరి్టఫికెట్లు, కాగితాలు సవరించండి.  
🔹 సమాచారం సమగ్రంగా, సరైనదిగా, సంపూర్ణంగా ఉండాలి సుమా. 
🔹 కొత్త ఐటీఆర్‌ 4లో రెండు ఇళ్ల మీద ఆదాయం డిక్లేర్‌ చేయొచ్చు. అద్దె చేతికి రాకుంటే.. అంటే దాని బాకీలు/అద్దెల వివరాలు చెప్పవచ్చు. 
🔹 విదేశీ ఆస్తులు/ఆదాయం సమాచారం ఇవ్వనవసరం లేదు.  
🔹పాన్‌తో పాటు ఆధార్‌ కార్డు సమన్వయం కావాలి 
🔹 టర్నోవరు ఆదాయాల్లో విషయాలు అన్నీ కాగితాల లెక్కలు, రిటర్నులు కావాలి. అక్కడ ఎటువంటి పొరపాటు చేయొద్దు.  
చివరిగా ఈ ఫారం కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. అందుకే ‘సుగమ్‌’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement