
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం బయట పెట్టుబడులు పెట్టడం ఆపాలని, ఇక్కడే (అమెరికా) ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమక్షంలో జరిగిన సంభాషణలో.. ట్రంప్ కుక్‌ను, "టిమ్, యాపిల్ అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతుంది? అని అడిగారు. దీనికి స్పందించిన టిమ్ కుక్ 600 బిలియన్ డాలర్లు అని అన్నారు. అంతే కాకుండా.. అమెరికాలో యాపిల్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడిని కూడా ప్రశంసించారు.
ఇతర సీఈఓలను కూడా ట్రంప్ ఇదే ప్రశ్న అడిగారు. దీనికి జుకర్‌బర్గ్ 600 బిలియన్ డాలర్లు అని చెప్పగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాబోయే రెండేళ్లలో 200 బిలియన్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బదులిస్తూ.. మేము 75 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లు అని అన్నారు. వీరందరికీ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ విందుకు దేశంలోని దాదాపు దిగ్గజాలందరూ హాజరయ్యారు. కానీ అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ మాత్రం హాజరు కాలేదు. ఈ విందుకు ట్రంప్ మస్క్‌ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.
.@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States... That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy
— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025