GST Revenue Collection: లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

GST Crossed 1.16 Lakh Crore For The July 2021 - Sakshi

న్యూఢిల్లీ: జులైకి సంబంధించి వస్తు సేవల పన్ను ఆదాయం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.  2021 జులై నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

వసూళ్లు ఇలా
జులైకి సంబంధించి మొత్తం 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అవగా ఇందులో సీజీఎస్టీ 22.19 వేల కోట్లు, ఎస్‌జీఎస్టీ 28.53 వేల కోట్లుగా ఉన్నాయి. ఇక దిగుమతులకు సంబంధించి ఐజీఎస్టీ రూ. 57.86 వేల కోట్లు వసూలు అయినట్టు మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో
గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2020 జులైలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు రూ.2,138 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ 2,730 కోట్లు వచ్చాయి. తెలంగాణకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు  రూ.2,876 కోట్ల నుంచి రూ. 3,610 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరగగా ఏపీలో 28 శాతం పెరిగాయి.

కరోనా తగ్గడంతో
కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్డడంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు ఆర్థిక మంత్రి. గత రెండు నెలలుగా ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనమని ఆర్థికక శాఖ పేర్కొంది. అంతకు ముందు కోవిడ్‌ కారణంగా మే, జూన్‌లలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top