గూగుల్ పే యూజర్లకు డెబిట్ కార్డులు

Google Will Announce New Google Pay App and Co Branded Debit Card  - Sakshi

గూగుల్ పే యూజర్లకు ఓ వెసులుబాటు కలగబోతోంది. తరచూ రివార్డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది గూగుల్ పే యాప్. తాజాగా గూగుల్ పే వినియోగదారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది గూగుల్. గూగుల్ అంతర్జాతీయ మార్కెట్ల కోసం పే యాప్ లో కొత్త అప్డేట్ ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ అప్డేట్ లో భాగంగా కో బ్రాండెడ్ డెబిట్ కార్డులను కూడా వినియోగదారులకు అందించబోతోంది. గూగుల్ పే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా గూగుల్ తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు వినిపిస్తుంది. ఈ సర్వీసులు ముందుగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ అందించనున్నట్లు సమాచారం. ఈ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు తీసుకురానుంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top