గూగుల్‌ పిక్సెల్‌ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. | Sakshi
Sakshi News home page

గూగుల్‌ పిక్సెల్‌ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల..

Published Thu, Aug 19 2021 9:25 PM

Google Pixel 5a 5g Launched - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మార్కెట్లలోకి గూగుల్‌ పిక్సెల్‌ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కొత్తగా లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌ గూగుల్‌ 4ఏ 5జీ మాదిరగానే ఉండనుంది. డిజైన్ మాత్రమే కాదు, చాలా  స్పెసిఫికేషన్‌లు అలాగే ఉన్నాయి. పిక్సెల్‌ 5 ఎ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లకు మరింత చౌక ధరకు అందించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొద్ది మార్పులను చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కాస్త పెద్ద డిస్‌ప్లేతో రానుంది, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్‌ను మార్కెట్లలోకి రిలీజ్‌ చేసింది.

పిక్సెల్ 4ఎ 5జీ మోడల్‌తో పోలిస్తే చాలా పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చారు. పిక్సెల్‌ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్‌ చార్జర్‌తో పాటురానుంది. కాగా పిక్సెల్‌ 6 సిరీస్‌ ఫోన్లకు చార్జర్‌ రాదని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే కలర్‌ బ్లాక్‌ కలర్‌లో రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం యూఎస్‌ఏ, జపాన్‌ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. త్వరలోనే భారత మార్కెట్లలోకి రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిక్సెల్‌ 5ఏ 5జీ ధర సుమారు రూ. 33,400 ఉండనుంది. 

గూగుల్‌ పిక్సెల్‌ 5ఏ 5జీ ఫీచర్స్‌

 • ఆండ్రాయిడ్ 11 అపరేటింగ్‌ సిస్టమ్‌
 • 6.34-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే విత్‌ 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్
 • 20: 9 యాస్పెక్ట్ రేషియో, 
 • 413ppi పిక్సెల్ డెన్సిటీ+ హెచ్‌డీఆర్‌ సపోర్ట్
 • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ఎస్‌ఓసీ 
 • అడ్రినో 620 జీపీయూ 
 • 6జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సపోర్ట్‌
 • 12.2+ 16మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
 • 8మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
 • 118.7 ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూ
 •  IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌
 • 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
 • 4,680mAh బ్యాటరీ

Advertisement
Advertisement