నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది

Google Layoffs: Google Laid Off HR While He Was In Interview - Sakshi

ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థ గూగుల్ కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సంస్థ చేపట్టిన తొలగింపు చర్యలకు ఎంతో మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా సంస్థలో ఉద్యోగం కోసం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్న టైంలోనే హెచ్‌ఆర్ ఉద్యోగి ఓ మెసేజ్‌ చూసి షాక్‌ అయ్యాడు. ఇంతకీ అందులో ఏముందంటే! 

యూ ఆర్‌ ఫైర్డ్‌... 
డాన్ లనిగన్ ర్యాన్ గూగుల్ లో హెచ్‌ఆర్‌ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డాన్‌ కాల్ అకస్మాత్తుగా డిస్‌కనెక్ట్ అయ్యింది.అలా ఎందుకు జరిగిందో కనక్కునేందుకు తన సిస్టమ్ నుంచి ఆఫీస్‌కు కాంటాక్ట్‌​ అయ్యిందుకు ప్రయత్నించాడు.

చివరికి సిస్టమ్‌ కూడా లాక్ అయ్యింది. ఇంతలో తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్న మెసేజ్‌ వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. ‘ గత శుక్రవారం వేల మందితో సిబ్బందిని గూగుల్‌ (Google) తొలగించింది. అందులో నేను కూడా ఉన్నానంటే నమ్మలేకున్నాను. గూగుల్‌లో తన ప్రయాణం ఇంత ఆకస్మిక ముగుస్తుందని ఊహించలేదని ర్యాన్ తన లింక్డ్‌ఇన్ లో పోస్ట్‌ చేశాడు.

గత వారం 12,000 సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థలో ఈ కోతలు గురించి ఊహాగానాలు నెలల తరబడి చక్కర్లు కొడుతున్నప్పటికీ, ఈ స్థాయిలో లేఆఫ్స్‌ ఊహించలేదుని ఉద్యోగులు అంటున్నారు.

చదవండి: 70కి పైగా స్టార్టప్‌లలో వేలాది మంది తొలగింపు.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top