జెమిని ఏఐ యూజర్లకు గూగుల్‌ హెచ్చరిక!

Google issues big warning for all Gemini AI users  - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌లో కీలక మార్పులు చేస్తూ వస్తుంది. బార్డ్‌ దాని పేరును జెమినిగా మార్చడం, కొత్త ఆండ్రాయిడ్‌ యాప్‌ను విడుదల చేయడం, కొత్త అల్ట్రా 1.0 భాషా మోడల్‌ను ఆవిష్కరించడం వంటివి ఉన్నాయి. అయితే, ఈ తరుణంలో గూగుల్‌ సంస్థ జెమిని యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. చాట్‌బాట్‌తో ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయొద్దని కోరింది. 

జెమిని యాప్‌ లేదా వెబ్‌సైట్‌లు గూగుల్ అసిస్టెంట్‌కి అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్‌. ఇందులో ఎదైనా సమాచారం గురించి తెలుసుకుని దాన్ని డిలీట్‌ చేస్తే డేటా అంటా గూగుల్‌ డేటాలో స్టోరేజ్‌ అవుతాయి. 

యూజర్‌ తన డివైజ్‌లో జెమిని యాక్టివిటీని డిసేబుల్‌ చేసినా.. అప్పటి వరకు సెర్చ్‌ చేసిన సమాచారం వివరాలు 72 గంటలపాటు స్టోర్‌ అవుతాయి. కొన్నిసార్లు ఈ సమాచారం మూడేళ్లపాటు గూగుల్‌ స్టోరేజ్‌లో ఉంటుంది అని గూగుల్ జెమిని యాప్‌ ప్రైవసీ బ్లాగ్‌లో పేర్కొంది. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top