పసిడి, వెండి.. 3 రోజుల లాభాలకు బ్రేక్‌

Gold, Silver prices plunges from one month highs - Sakshi

నెల రోజుల గరిష్టం నుంచి వెనకడుగు

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 50,290కు

వెండి కేజీ ఫ్యూచర్స్‌ రూ. 67,555 వద్ద ట్రేడింగ్‌

కామెక్స్‌లో 1,888 డాలర్లకు ఔన్స్‌ పసిడి

25.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడు రోజులు ర్యాలీ బాటలో సాగిన పసిడి, వెండి ధరలు తాజాగా కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప వెనకడుగుతో కదులుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా లిక్విడిటీ చర్యలను కొనసాగించనున్నట్లు యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొన్న నేపథ్యంలో పసిడి జోరందుకున్న విషయం విదితమే. వెరసి గురువారం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1900 డాలర్లను అధిగమించింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా.. దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 50,000ను దాటింది. వెండి సైతం కేజీ రూ. 68,000ను దాటేసింది. కొద్ది రోజులుగా ఫెడ్‌ నెలకు 120 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్‌ చేస్తోంది. కాగా.. మరోపక్క 700 బిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజీపై యూఎస్‌ కాంగ్రెస్‌ సమీక్షను చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సైతం పసిడికి జోష్‌ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..  (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు)

స్వల్ప వెనకడుగు..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 100 క్షీణించి రూ. 50,290 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. 50,358 వద్ద బలహీనంగా ప్రారంభమైన పసిడి తదుపరి రూ. 50,242 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 712 క్షీణించి రూ. 67,555 వద్ద కదులుతోంది. తొలుత రూ. 67,999 వద్ద ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. 67,456 వరకూ బలహీనపడింది. 

అక్కడక్కడే..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్‌ స్వల్పంగా 0.1 క్షీణించి 1,888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.2 శాతం బలహీనపడి 1,882 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం వెనకడుగుతో 25.98 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top