ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు! | Gold Rates Slide Across Hyderabad Delhi Chennai Know Latest Price | Sakshi
Sakshi News home page

ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు!

May 28 2026 7:53 PM | Updated on May 28 2026 8:57 PM

Gold Rates Slide Across Hyderabad Delhi Chennai Know Latest Price

భారతదేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు (మే 28) పసిడి రేటు భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎక్కడ, ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మే 26న 1,58,890 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి (మే 28) 1,56,060 రూపాయల వద్దకు చేరింది. అంటే మూడు రోజుల్లో 3320 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర 1,45,650 రూపాయల నుంచి 1,43,050 వద్దకు (3050 రూపాయలు తగ్గింది) చేరింది.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల తులం ధర రూ.1,59,040 దగ్గర నుంచి 1,56,210 రూపాయల (రూ.3320 తగ్గింది) వద్దకు.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,45,800 రూపాయల నుంచి 1,43,200 రూపాయల (3050 రూపాయలు తగ్గింది) వద్దకు చేరింది.

చెన్నైలో బంగారం ధరలు.. మూడు రోజుల్లో భారీ మార్పుకు లోనయ్యాయి. ఇక్కడ మే 26న రూ.1,60,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మే 28 నాటికి 158180 రూపాయల (రూ.3060 తగ్గింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,47,300 నుంచి రూ. 1,45,000 వద్దకు (రూ.2800 తగ్గింది) చేరింది.

ఇదీ చదవండి: ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది!

Advertisement
 
Advertisement
Advertisement