పసిడి ధర మళ్లీ లక్షన్నర పైకి... | Gold prices surge by Rs 3300 to reclaim the Rs 150800 per 10 grams | Sakshi
Sakshi News home page

పసిడి ధర మళ్లీ లక్షన్నర పైకి...

Jul 4 2026 4:47 AM | Updated on Jul 4 2026 4:47 AM

Gold prices surge by Rs 3300 to reclaim the Rs 150800 per 10 grams

రూ.3,300 అప్‌.. రూ.1,50,800

నాలుగో రోజూ వెండి ర్యాలీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో బుల్లిష్‌ ట్రెండ్‌తో పాటు యూఎస్‌ కరెన్సీ డాలర్‌ బలహీనత కారణంగా దేశీయంగా పసిడి ధర మళ్లీ లక్షన్నర (రూ.1.50 లక్షలు) మార్కును దాటింది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.3,300 పెరిగి రూ.1,50,800 స్థాయికి చేరింది. అటు వెండి ధర కూడా తన లాభాల ర్యాలీని కొనసాగిస్తూ కేజీకి రూ. 5,000 పెరిగి రూ.2,45,000 స్థాయికి ఎగిసింది.

అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గడం, డాలర్‌ ఇండెక్స్‌ 101 పాయింట్ల దిగువకు పడిపోవడంతో బులియన్‌ మార్కెట్లో తాజా కొనుగోళ్లు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు సౌమిల్‌ గాంధీ తెలిపారు. అమెరికాలో ఉపాధి గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందంటూ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ కెవిన్‌ వార్‌‡్ష చేసిన వ్యాఖ్యలు కూడా పసిడి, వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

రూ.4,200 డాలర్ల దిశగా..
అంతర్జాతీయంగాబంగారం ధర ఔన్సుకు 1.4 శాతం లాభపడి 4,181.50 డాలర్లకు చేరింది. వెండి 2.44 శాతం పెరిగి 62.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధర త్వరలో 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి కైనాత్‌ చైన్‌వాలా  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement