ఐదేళ్లలో నైపుణ్యాలు నిరుపయోగం! | GLMC report said India as a global leader in technological adaptation, AI, machine learning, automation | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సౌత్‌ లీడర్‌గా భారత్‌.. జీఎల్‌ఎంసీ నివేదిక

Dec 10 2024 12:28 PM | Updated on Dec 10 2024 3:08 PM

GLMC report said India as a global leader in technological adaptation, AI, machine learning, automation

భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి రంగాల్లో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఎదుగుతుందని గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ (జీఎల్‌ఎంసీ) నివేదిక విడుదల చేసింది. సాంకేతిక విభాగాల్లో గ్లోబల్ సౌత్‌లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ‘నేవిగేటింగ్‌ టుమారో’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో భారత్‌ జాబ్‌ మార్కెట్‌ వైవిధ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే భారతీయ నిపుణుల్లో సగానికిపైగా వచ్చే ఐదేళ్లలో తమ నైపుణ్యాలు ఉపయోగంలో లేకుండా పోతాయని ఆందోళన చెందుతున్నట్లు నివేదిక తెలియజేసింది.

నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తమ నైపుణ్యాలు వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా వాడుకలో లేకుండా పోతాయనే భయంతో ఉన్నారు.

  • ఈ ధోరణి యూకేలో 44 శాతం, ఆస్ట్రేలియాలో  43 శాతంతో కనిష్టంగా, బ్రెజిల్‌లో అధికంగా 61 శాతం, చైనాలో 60 శాతంగా ఉంది.

  • భారత్‌లో 32 శాతం మంది రాబోయే ఐదేళ్లలో రీస్కిల్లింగ్ అవసరాలను గుర్తించారు. ఇది చైనాలో 41 శాతం, వియత్నాం 36 శాతం, యూకే 14 శాతం, యూఎస్‌ఏ 18 శాతంగా ఉంది.

  • రానున్న రోజుల్లో సాంకేతికత అవసరాలు పెరుగుతాయి. అందుకు అనుగుణంగా భారత యువత నైపుణ్యాలు పెంచుకుంటుంది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి సాంకేతిక రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని ఆసక్తిగా ఉంది.

ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?

  • అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణా వ్యవస్థలు మరింత మెరుగుపడాలి.

  • 19 శాతం మంది ప్రస్తుతం కొత్త నైపుణ్యాలకు అనువైన విద్యా విధానం లేదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ముఖ్యంగా 21 శాతం మంది యువకులలో (18-34) ఉంది.

  • భారత్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి సమయాభావం-40 శాతం మంది, ఆర్థిక పరిమితులు-38 శాతం మందికి అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌తో సమానంగా ‍బ్రెజిల్‌లో సమయం లేకపోవడం, ఆర్థిక పరిమితులు వరుసగా 43 శాతం, 39 శాతంగా, దక్షిణాఫ్రికాలో 45 శాతం, 42 శాతంగా ఉంది. నార్వే, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిని పెద్దగా అడ్డంకులుగా భావించడంలేదు. నార్వేలో ఇది వరుసగా 27 శాతం, 28 శాతంగా ఉంది. యూకేలో 31 శాతం, 24 శాతంగా ఉంది.

  • భారతీయ నిపుణులు సాంకేతికంగా స్కిల్స్‌ పెంచుకోవడానికి అవకాశాలను వెతుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement