రిలయన్స్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి | GIC and TPG to invest Rs 7,350 crore in Reliance Retail | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి

Oct 4 2020 4:31 AM | Updated on Oct 4 2020 4:39 AM

GIC and TPG to invest Rs 7,350 crore in Reliance Retail - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో (ఆర్‌ఆర్‌వీఎల్‌) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పెట్టుబడులు వచ్చి చేరనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శనివారం ప్రకటించింది. తద్వారా ఆర్‌ఆర్‌వీఎల్‌లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది.

డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు. మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ టీపీజీ తాజాగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్‌ఆర్‌వీఎల్‌లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement