స్థిరీకరణకు అవకాశం | Sakshi
Sakshi News home page

స్థిరీకరణకు అవకాశం

Published Mon, Sep 18 2023 5:18 AM

Focus on Fed Reserves monetary policies says markets experts - Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు వరుస ర్యాలీతో పాటు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనవచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఫెడ్‌ రిజర్వ్‌) ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటునన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు, స్థూల ఆర్థిక గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.

వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని చెబుతున్నారు. వినాయక చవితి సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు ఉదయం సెషన్‌లో మాత్రమే సెలవు పాటిస్తాయి. సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్‌ జరుగుతుంది.  కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ 20 సదస్సు విజయవంతం, అంచనాలకు తగ్గట్లు ద్రవ్యల్బోణ డేటా నమోదుతో సూచీలు వరుసగా మూడోవారమూ లాభాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 1240 పాయింట్లు, నిఫ్టీ 372 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

వారాంతపు రోజైన శుక్రవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి.  ‘‘లార్జ్‌క్యాప్‌ షేర్ల రాణించే వీలున్నందున మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ కొనసాగొచ్చు. విస్తృత మార్కెట్లో కొనుగోళ్ల ప్రాధాన్యత రంగాల వారీగా మారొచ్చు. ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశ నిర్ణయాల వెల్లడి ముందు అప్రమత్తత నేపథ్యంలో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువును 20,050 – 20,000 శ్రేణిలో తక్షణ మద్దతు, ఎగువ స్థాయిలో 20,200 – 20,250 పాయింట్ల పరిధిలో కీలక నిరోధం కలిగి ఉందని ఆప్షన్స్‌ డేటా సూచిస్తోంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ సీనియర్‌ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్‌ గౌర్‌ తెలిపారు.  

ఫెడ్‌ వడ్డీరేట్ల నిర్ణయ ప్రభావం
రెండురోజుల పాటు జరిగే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌రల్‌ రిజర్వ్‌ కమిటీ సమావేశం నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. ఇదే సందర్భంగా ఫెడ్‌ రిజర్వ్‌ యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌ సర్వే వెల్లడించనుంది. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకే ఫెడ్‌ మొగ్గుచూపొచ్చని ఆర్థికవేత్తల భావిస్తున్నారు.  వడ్డీ రేట్ల పెంపు జరిగితే ఈక్విటీ మార్కెట్లు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు.

ప్రపంచ పరిణామాలు
బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(గురువారం), బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(శుక్రవారం)లూ ఇదే వారంలో వడ్డీరేట్లు వెల్లడించనున్నాయి. అమెరికా ఎస్‌అండ్‌పీ తయారీ, సేవారంగ పీఎంఐ, నిరుద్యోగ డేటా, ఇంగ్లాండ్, యూరోజోన్‌ ద్రవ్యోల్బణ డేటా, జపాన్‌ వాణిజ్య లోటు గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబింజేసే ఈ స్థూల గణాంకాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు.

ఐపీఓ మార్కెట్‌పై దృష్టి
గతవారంలో మొదలైన సంహీ హోటల్స్, జాగిల్‌ప్రీపెయిడ్‌ ఓషన్‌ సరీ్వసెస్‌ ఐపీఓలు సోమవారం(సెపె్టంబర్‌ 18న), యాత్రా ఆన్‌లైన్‌ ఐపీఓ బుధవారం(సెపె్టంబర్‌ 20న) ముగియనున్నాయి. ఇక సాయి సిల్క్స్‌ కళామందిర్, సిగ్నేచర్‌గ్లోబల్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూలు బుధవారం ప్రారంభమై, శుక్రవారం ముగియనున్నాయి. వైభవ్‌ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఐపీఓ ఈ నెల 22–26 తేదీల మధ్య జరగనుంది. ప్రథమార్ధంలో రూ.4,800 కోట్ల ఉపసంహరణ   భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారు.

ఈ సెపె్టంబర్‌ ప్రథమార్ధంలో దాదాపు రూ. 4,800 కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. డాలర్‌ విలువ బలపడుతోంది. ప్రపంచ ఆర్థికవృద్ధిపై ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు పాల్పడుతున్నారు. భారత మార్కెట్లు రికార్డు స్థాయిలో ర్యాలీ చేయడం, వాల్యూయేషన్‌లు ఎక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో విక్రయాలు కొనసాగే వీలుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వి కె విజయకుమార్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement