
దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయన్సెస్‌తో సహా 26 ఉత్పత్తి విభాగాలలో ఒక వినూత్న ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులకు తక్షణ విలువ, మెరుగైన అప్‌గ్రేడ్లను అందించడానికి దీన్ని రూపొందించారు. ఇందుకోసం సరికొత్త ఏఐ-ఆధారిత 10-దశల డయాగ్నొస్టిక్ టూల్ ఏర్పాటు చేస్తోంది. ఇది రియల్ టైమ్ , పారదర్శక ఉత్పత్తి విలువలను నిమిషాల్లో అందిస్తుంది.
- ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు
క్రాస్-కేటగిరీ ఎక్స్ఛేంజ్: కస్టమర్లు పాత ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు వంటి వస్తువులను విస్తృత శ్రేణి కొత్త ఉత్పత్తుల కోసం ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. - రియల్ టైమ్ ఏఐ డయాగ్నస్టిక్స్: పాత ఉత్పత్తుల వేగవంతమైన, ఖచ్చితమైన, పారదర్శక విలువను నిర్ధారిస్తుంది.
- స్థిరమైన వాణిజ్యం: పనికిరాని గృహ ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల పునర్వినియోగం, రీసైక్లింగ్ ను ప్రోత్సహిస్తుంది. వాటిని "ఇంట్లో కరెన్సీ"గా మారుస్తుంది.
- టైర్ 2 & 3 సిటీ ఫోకస్: ప్రీమియం ఉత్పత్తులకు అందుబాటును పెంచడం, చిన్న పట్టణాల్లోనూ ప్రీమియం ఉత్పత్తులు కొనే వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
- పండుగ సీజన్ బూస్ట్: రాబోయే షాపింగ్ సీజన్లో కస్టమర్ విలువను పెంచడానికి సమయం.
స్థిరమైన వినియోగాన్ని పెంచే తెలివైన, సాంకేతికతతో కూడిన రీకామర్స్ వ్యవస్థను నిర్మించడానికి ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ & రీ-కామర్స్ బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ పేర్కొన్నారు.