
ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) రెండు రోజుల మంథన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 12, 13వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనుంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లు, ఇతర ముఖ్య అధికారులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తదుపరి తరం సంస్కరణలపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చివరిగా 2022 ఏప్రిల్‌లో ఇదే తరహా కార్యక్రమం జరిగింది. సేవల అందుబాటును పెంచడం, అత్యుత్తమ సేవలకు సంబంధించి (ఈఏఎస్‌ఈ) సంస్కరణలను ఆర్థిక సేవల విభాగం మార్గదర్శకంలో చేపట్టొచ్చని పేర్కొన్నాయి. కస్టమర్ సేవలను ఎలా మెరుగుపరచాలి, డిజిటైజేషన్, హెచ్‌ఆర్ ప్రోత్సాహకాలు, కార్పొరేట్ గవర్నెన్స్, సహకారం విషయమైన తీసుకోవాల్సిన చర్యలను సూచించాలంటూ చివరి పీఎస్‌బీ మంథన్‌లో ఆరు వర్కింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం.