బైబ్యాక్‌లో షేర్లు అమ్ముకుంటే 12 శాతం సర్‌చార్జీ | Finance Bill Update 12pc Flat Surcharge Levied on Share Buyback Profits | Sakshi
Sakshi News home page

బైబ్యాక్‌లో షేర్లు అమ్ముకుంటే 12 శాతం సర్‌చార్జీ

Mar 26 2026 7:11 AM | Updated on Mar 26 2026 7:13 AM

Finance Bill Update 12pc Flat Surcharge Levied on Share Buyback Profits

న్యూఢిల్లీ: వ్యక్తిగత లేదా కార్పొరేట్‌ వాటాదారులు ఎవరైనా బైబ్యాక్‌లో భాగంగా విక్రయించే షేర్లపై ఆర్జించే లాభాలకు 12% సర్‌చార్జీ వర్తించనుంది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఫైనాన్స్‌ బిల్లులో సవరణలకు తాజాగా లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.

2026 ఫైనాన్స్‌ బిల్లులో 32 సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదించగా.. లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రేపు(శుక్రవారం) రాజ్యసభలో ఆమో దం కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే రూ. 50 లక్షలవరకూ ఆదాయంగల వారిపై ఎలాంటి సర్‌చార్జీ లేదు.

రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ పన్నువర్తించే ఆదాయంగల వారికి బైబ్యాక్‌లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించే లాభాలపై 10% సర్‌చార్జీ అమలు చేస్తున్నారు. అయితే ఫ్లాట్‌ 12% సర్‌చార్జీ విధింపుతో ఆయా పన్ను చెల్లింపుదారులపై భారం పడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement