
రాయదుర్గం: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్–హైదరాబాద్ క్యాంపస్‌లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ అండ్ డిజిటల్ ఫ్యాషన్ వ్యాపారం, లెదర్ యాక్సెసరీస్, బ్యాగ్‌ల అభివృద్ధి రంగాల్లో పరిశ్రమలు, సిద్ధంగా ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని పెంచడానికి దోహదం చేసేలా డిప్లొమో కోర్సుల ముఖ్య లక్షణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కోర్సులను ఆరు నెలల వ్యవధి గల రెండు మాడ్యూల్‌లుగా విభజించారు. అభ్యాసకులు ఒక మాడ్యూల్‌ను అనుసరించి సర్టిఫికెట్ పొందవచ్చు. రెండు మాడ్యూల్‌లను పూర్తి చేసి పూర్తి సంవత్సరం డిప్లొమో పొందడానికి అవకాశం కల్పిస్తారు.
అందుబాటులోకి వచ్చే కోర్సులు ఇవే..
మొదటి విడతలో నూతనంగా డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్‌మెంట్, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్‌మెంట్ కోర్సులకు ఒక్కోదానికి ఒక్క మాడ్యూల్‌కు రూ.45 వేలు, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ ఒక్క మాడ్యూల్‌కు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కోర్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. కోర్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు వెబ్‌సైట్ www.fddiindia.comలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 94404 71336, 99667 55563, 99667 55536లలో సంçప్రదించాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్‌లో సంప్రదించాలని సూచించారు.