భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులందరికీ ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. టోల్‌గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, వేగంగా ముందుకు వెళ్లడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రవేశపెట్టింది. అయితే.. చాలామంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ టోల్‌గేట్ల వద్ద ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఫాస్ట్‌ట్యాగ్‌లో ఉండే.. ఆర్ఎఫ్ఐడీ చిప్ టోల్ ప్లాజా స్కానర్లతో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ చిప్ సరిగా పనిచేయకపోతే స్కానర్ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేయలేవు. ఫలితంగా వాహనం టోల్‌గేట్ వద్ద ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ పెరిగి పొడవైన క్యూలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఎన్‌హెచ్‌ఏఐ ప్రకారం ఫాస్ట్‌ట్యాగ్ దెబ్బతినడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
ఒకటి.. వెహికల్ విండ్ షీల్డ్ తరచుగా శుభ్రం చేయడం. కొంతమంది గట్టిగా రుద్దడం లేదా కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఫాస్ట్‌ట్యాగ్‌లోని ఆర్ఎఫ్ఐడీ చిప్ దెబ్బతింటుంది.
రెండవది.. ఎండ, దుమ్ము, వర్షం వంటి వాతావరణ ప్రభావాలు. ఎక్కువకాలం ఫాస్ట్‌ట్యాగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల కూడా టోల్ ప్లాజా స్కానర్లు రీడ్ చేయలేవు.
మూడవది.. పాతబడిన ఫాస్ట్‌ట్యాగ్‌లు. చాలా రోజుల పాటు ఉపయోగించిన ట్యాగ్‌లు సహజంగానే పనితీరును కోల్పోతాయి.
Are you facing FASTag scanning issues at Toll Plazas? Your FASTag could be damaged causing delays at Toll Plazas. Contact your issuer bank today and get your FASTag replaced.@NHAI_Official @MORTHIndia pic.twitter.com/hdqCoARVp1
— FASTagOfficial (@fastagofficial) May 4, 2026
ఫాస్ట్‌ట్యాగ్ ఐదేళ్లకు పైబడితే లేదా తరచూ స్కాన్ సమస్యలు ఎదురైతే వెంటనే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే టోల్ గేట్ల వద్ద అనవసర ఆలస్యం, ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు డబుల్ డిడక్షన్ లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యలు కూడా వస్తాయి.
ఇదీ చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!
వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. విండ్‌షీల్డ్ మీద ట్యాగ్ ఉన్న ప్రాంతాన్ని గట్టిగా రుద్దకూడదు. ఫాస్ట్‌ట్యాగ్‌ను వంచడం, తీసి మళ్లీ అతికించడం చేయకూడదు. ట్యాగ్‌పై ఇతర స్టిక్కర్లు లేదా సన్ ఫిల్మ్‌లు ఉండకూడదు. సమస్యలు కనిపించిన వెంటనే ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును సంప్రదించి కొత్త ట్యాగ్ తీసుకోవాలి.


