ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్‌ బాధ ఇది!

Facebook Layoffs: An Iitian Lost Job After 2 Days Joining Canada - Sakshi

ఇటీవల జరుగుతున్న పరిణామలు చూస్తుంటే ఐటీ రంగంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కంపెనీలు ఒకదాని వెనక మరొకటి తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటంతో పాటు ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. దీంతో లేఆఫ్‌లు తప్పవని కంపెనీలు చెబుతున్నాయి.

ఇటీవల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం ఉద్యోగాల పోగొట్టుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. అలా మోటా చేపట్టిన కోతలు వల్ల ఉద్యోగం పోయిన ఓ ఐఐటియన్ తన బాధని లింక్డిన్‌లో షేర్‌ చేశాడు.

ఏం చేయాలి తెలియడం లేదు..
ఐఐటియన్‌ హిమాన్షు షేర్‌ చేసని పోస్ట్‌లో... “నేను అందరిలానే ఎన్నో కలలతో మెటా సంస్థలో చేరడానికి కెనడాకు మకాం మార్చాను. భవిష్యత్తు బాగుంటుందని భావించే లోపే ఊహించని షాక్‌ తగిలింది. ఉద్యోగంలో చేరిన 2 రోజులకే, కంపెనీ భారీ తొలగింపు కారణంగా మెటాలో నా ప్రయాణం ముగిసింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ క్లిష్టసమయాలను ఎదుర్కొవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది.

అయితే తదుపరి కార్యాచరణ ఏమిటని, ఎటువంటి ఐడియా కూడా నాకు లేదని’’ తెలిపాడు. తనకు భారత్‌లో లేదా కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం కావాలని కోరుతూ ఈ పోస్ట్‌ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చాలా మంది హెచ్‌1బీ వీసాపై ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాలో ఉద్యోగం చేసేందుకు హిమాన్షులానే విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం వారికి ఉద్యోగం పోవడంతో.. వారు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుకోవాల్సి ఉంది. లేదంటే.. ఆ దేశాలను విడిచి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. 

చదవండి: ఐటీలో ఫేక్‌ కలకలం.. యాక్సెంచర్‌ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top