నల్లజాతీయుల్ని కోతులతో పోల్చిన ఫేస్‌బుక్‌.. వీడియోపై వివాదం

Facebook Facial Recognition Fails Show Humans As Primates - Sakshi

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ వివాదంలో చిక్కుకుంది. మనుషుల్ని కోతుల్లా రికమండ్‌ చేయడంతో ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీపై ..

సోషల్‌ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ వివాదంలో చిక్కుకుంది. రేసిజం సంబంధిత ఫీచర్‌ను ఎంకరేజ్‌ చేయడం ద్వారా నెటిజన్స్‌ నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే నష్టనివారణ కోసం క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్స్‌ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు.  

విషయం ఏంటంటే.. ఓ బ్రిటిష్‌ టాబ్లాయిడ్‌కు చెందిన  వీడియో(జూన్‌ 2020లోది) ఒకటి ఈ మధ్య ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో నల్ల జాతీయులను ఉద్దేశించి.. ‘ఇలాంటి కోతుల వీడియోలు మరిన్ని కోరుకుంటున్నారా?’ అంటూ యూజర్లను కోరింది ఫేస్‌బుక్‌. అంతే.. ఇది జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్‌బుక్‌ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు కొందరు. 

ఇది కచ్చితంగా పొరపాటే. జరిగిన దానికి క్షమాపణలు చెప్తున్నాం అని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఆ టాపిక్‌ను డిసేబుల్‌ చేయడంతో పాటు పొరపాటు ఎక్కడ జరిగిందనేదానిపై దర్యాప్తు చేయిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇదిలా ఉంటే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌పై మేధావులు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రైమేట్స్‌లో కోతులు, చింపాంజీలు, గొరిల్లాతో పాటు మనుషులు కూడా ఉంటారని, బహుశా ఆ ఉద్దేశంతో అలా రికమండేషన్‌ వచ్చి ఉంటుందని కొందరు టెక్నికల్‌ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇది ముమ్మాటికీ రేసిజం వ్యవహారామేనని ఫేస్‌బుక్‌పై దావాకి సిద్ధం అవుతున్నారు మనోభావాలు దెబ్బతిన్న కొందరు.

చదవండి: భారత్‌ కొత్త ఐటీ చట్టాలపై పోరుకు రెడీ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top