ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. వాళ్లకి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్‌!

Epfo Rules: Private Employee Get Pension If They Complete 10 Years Job Tenure - Sakshi

మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు పూర్తి చేశారా? అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకోసమే. ప్రయివేటు రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే  కొన్ని షరతులకు లోబడి ప్రభుత్వం ఈ పెన్షన్‌ని అందిస్తోంది. అవేంటో చూద్దాం!

నిబంధనలు ఏం చెప్తోంది!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం..  సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 10 ఏళ్ల పూర్తయిన వారికి పింఛన్ సౌకర్యం లభిస్తుంది. అయితే సదరు ఉద్యోగికి 58 ఏళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా వారికి పెన్షన్ అందుతుంది. కాగా ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి కొంత సొమ్ము మినహాయించడమే ఇందుకు కారణం.

10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఏ ఉద్యోగి అయినా పెన్షన్ పొందడానికి అర్హత పొందుతాడు. అయితే ఉద్యోగ కాలపరిమితి మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. ఇందులో ఒక మినహాయింపు కూడా ఉంది. ఉద్యోగి 9 సంవత్సరాల 6 నెలల సర్వీస్‌ను కూడా 10 సంవత్సరాలకు సమానంగా లెక్కిస్తారు. ఉద్యోగం పదవీకాలం తొమ్మిదిన్నర సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, అది 9 సంవత్సరాలుగా మాత్రమే పరిగణిస్తారు.

ఉద్యోగి పదవీ విరమణ వయస్సు కంటే ముందు పెన్షన్ ఖాతాలో జమ చేసిన నగదుని విత్‌డ్రా చేసుకుంటే అటువంటి వారికి పెన్షన్‌కు అర్హత ఉండదు. కాగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల ప్రాథమిక జీతం,  డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్‌కు ఇవ్వబడుతుంది. అలాగే, ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్‌కి వెళ్తుంది. కంపెనీలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో డిపాజిట్ అవుతుంది. అదే సమయంలో, ప్రతి నెలా 3.67 శాతం ఈపీఎఫ్‌కి వెళుతుంది.

ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి
►పని చేస్తున్న సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగంలో గ్యాప్ ఉంటే, మీరు మళ్లీ ఉద్యోగం ప్రారంభించినప్పుడు, మీ UAN నంబర్‌ను మార్చకూడదు.
►ఉద్యోగాలు మారినప్పుడు, మీ కొత్త కంపెనీ తరపున ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. అలాగే, మీ మునుపటి ఉద్యోగం మొత్తం పదవీకాలం కొత్త ఉద్యోగానికి జత చేస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు మళ్లీ 10 సంవత్సరాల ఉద్యోగాన్ని పూర్తి చేయవలసిన అవసరం లేదు.
►ఉద్యోగి 5-5 సంవత్సరాలు రెండు వేర్వేరు సంస్థలలో పనిచేసినట్లయితే, అటువంటి ఉద్యోగికి కూడా పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. 

చదవండి: ట్రెండ్‌ మారింది.. పెట్రోల్‌, డీజల్‌,గ్యాస్‌ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top