Shocking Report Says That Elon Musk Treats Depression With Microdoses Of Special K Club Drug - Sakshi
Sakshi News home page

Elon Musk On Ketamine: మానసిక సమస్యతో ఎలాన్‌ మస్క్‌.. డిప్రెషన్ నుండి బయట పడేందుకు ఆ డ్రగ్ వాడకం!

Published Wed, Jun 28 2023 4:07 PM

Elon Musk Microdoses Ketamine To Treat Depression And Takes Full Doses At Parties: Report - Sakshi

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారంటూ పలు సంచలన నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, రోజూవారీ ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మస్క్‌ పార్టీలకు వెళ్తుంటారు. ఆ సమయంలో మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కెటామైన్ (డిప్రెషన్‌ తగ్గించుకునేందుకు వినియోగించుకునే మెడిసిన్‌) అనే  మందును ఎక్కువ డోస్‌లో తీసుకుంటున్నారంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక తెలిపింది. 

అంతేకాదు, డిప్రెషన్‌ నుంచి తాను బయటపడేందుకు తక్కువ మోతాదులో కెటామైన్‌ను తీసుకుంటున్నట్లు మస్క్‌ తన స్నేహితులకు చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఆ రిపోర్ట్‌ను ఊటంకించేలా.. మస్క్‌ డిప్రెషన్‌ నుంచి కోలుకునేలా కెటామైన్‌ ఎలా ఉపయోగపడుతుందనే తదితర అంశాలపై ట్విట్‌ చేశారు. ఆ ట్విట్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

డిప్రెషన్‌ అనేది బ్రెయిన్‌ సంబంధిత సమస్య. యుఎస్‌లో ఈ మానసిక సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కెటామైన్‌ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది జాంబిఫైయింగ్‌ బారిన పడేందుకు అవకాశం ఉన్న సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (ssri) అనే మెడిసిన్‌ను తీసుకుంటున్నారని ట్వీట్‌లో మస్క్‌ తెలిపారు. 

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (wsj) నివేదికల ప్రకారం.. మస్క్‌ ఆరోపిస్తున్నట్లుగా మత్తెక్కించే కెటామైన్‌ అనే డ్రగ్‌ను తీసుకునే కల్చర్‌ సిలికాన్‌ వ్యాలీ ఎగ్జిక్యూటీవ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మార్కెట్‌ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని వ్యాపారంలో పనితీరు మెరుగు పరుచుకోవడంతో పాటు సృజనాత్మకత కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

సిలికాన్‌ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ కంపెనీల్లో సీఈవోలు, ఫౌండర్‌లు కెటామైన్, మ్యాజిక్ మష్రూమ్‌లు, లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (ఎల్‌ఎస్‌డీ) మత్తు పదార్ధాల్ని తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే ప్రస్తావించింది. వారిలో గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ 'మ్యాజిక్ మష్రూమ్'లను తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే నివేదించింది. ఈ మ్యూజిక్‌ మష్రూమ్‌లలో శరీరాన్ని మత్తెక్కించే సైలోసిబిన్ (psilocybin) అనే రసాయనం ఉంటుంది.

2018లో పాడ్‌కాస్ట్‌ జరిగే సమయంలో
ఇలా సంచలనాత్మక కామెంట్లతో నిత్యం నెటిజన్ల నోళ్లలో నానే ఎలాన్‌ మస్క్‌కు తాజా ట్విట్‌లు కొత్తవేం కావనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. 2018లో జో రోగన్ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో గంజాయి తాగి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ఈ సంఘటన తర్వాత తనకు, స్పేస్‌ఎక్స్ ఉద్యోగులకు రెగ్యులర్ డ్రగ్ టెస్ట్‌లు జరుగుతున్నాయని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.  

కెటామైన్ వినియోగం.. అమెరికాలో అనుమతి
కెటామైన్ డిప్రెషన్‌ నుంచి కోలుకునేందుకు ఉపయోగించే మెడిసిన్‌. అమెరికాలో దీని వినియోగంపై నియంత్రణ ఉంది. వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణులు ఆధ్వర్యంలో పొడిగా, ద్రవ రూపంలో, మాత్రల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

జాంబిఫైయింగ్‌ అంటే?
మస్క్‌ చెబుతున్నట్లుగా..సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనే మెడిసిన్‌ వినియోగంతో జాంబిఫైయింగ్‌ అనే వ్యాధి సోకుతుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌తో బాధపడే వారు ఇష్టం వచ్చినట్లుగా మీద పడి కొరుకుతుంటారని హెల్త్‌కేర్‌ నివేదికలు చెబుతున్నాయి.

చదవండి👉 ముఖేష్‌ అంబానీ - ఎలాన్‌ మస్క్‌ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో?

Advertisement
Advertisement