వచ్చే ఏడాది ఏఐ ‘సూపర్‌హ్యూమన్’‌! | Elon Musk Predicts AI Will Surpass Humans in Digital Work by 2027 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది ఏఐ ‘సూపర్‌హ్యూమన్’‌!

Sep 1 2026 7:56 PM | Updated on Sep 1 2026 8:08 PM

Elon Musk AI Warning Superhuman Tech to Outperform Humans by 2027

ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2027) చివరి నాటికి ఏఐ సాంకేతికత డిజిటల్ ప్రపంచంలో మానవ సామర్థ్యాలను పూర్తిగా మించిపోతుందని, దాదాపు ఏ డిజిటల్ పనైనా ‘సూపర్‌హ్యూమన్’ స్థాయిలో నిర్వహించగలదని ఆయన స్పష్టం చేశారు. వెర్సెల్ (Vercel) సీఈఓ గ్విలెర్మో రాచ్ ఎక్స్ వేదికగా ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలపై చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భౌతిక వస్తువులను షేపింగ్‌ చేయడం మినహా కోడింగ్, రీసెర్చ్, సైబర్ సెక్యూరిటీ, చట్టపరమైన పనులు, డిజిటల్ కంటెంట్ సృష్టి.. వంటి ఏ రంగంలోనైనా ఏఐ మానవుల కంటే అద్భుతంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు. అయితే భౌతిక శ్రమ, రోబోటిక్స్ రంగం మాత్రం డిజిటల్ పురోగతితో పోలిస్తే కొంత నెమ్మదిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో దశాబ్దం క్రితమే గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఏఐ భవిష్యత్తులో హ్యాకింగ్, సిస్టమ్ సెక్యూరిటీ ఉల్లంఘనల్లో మనుషుల కంటే అత్యుత్తమంగా రాణిస్తుందని జోస్యం చెప్పినట్లు మస్క్ గుర్తుచేశారు.

మస్క్ తాజా అంచనాలు నాలెడ్జ్-వర్క్ పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ఉద్యోగ భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐ పర్యవేక్షణపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. యంత్రాలు మానవ నియంత్రణను దాటి స్వయంప్రతిపత్తితో పనిచేసే ఈ తరుణంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement