మార్చి 31 డెడ్‌లైన్‌: చేయాల్సిన కీలకమైన పనులు ఏంటో తెలుసా?

Do you know these these 5 tasks to complete before march 31st march - Sakshi

సాక్షి, ముంబై:  అనేక కీలకమైన ఆర్థిక పనులకు మార్చి 31  తుది గడువు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  చివరి  రోజు మార్చి 31 చివరి రోజు లోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే  మన జేబుకు చిల్లు పడక తప్పదు. ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతాల డీయాక్టివేషన్‌ లాంటి ప్రమాదం లేకుండా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్‌, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను ఒకసారి చూద్దాం.

2023, మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన  పైనాన్షియల్‌ టాస్క్స్‌
పాన్ -ఆధార్ కార్డ్ లింక్: మార్చి 31 లోపు పాన్  ఆధార్ కార్డ్‌లను లింకింగ్‌ పూర్తి చేయాలి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్  చెల్లదు. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను  ఫైల్ చేయలేరు.
అలాగే రూ. 1,000  ఫైన్‌. అంతేకాదు తప్పుడు లేదా చెల్లని పాన్‌ను కోట్ చేస్తే రూ. 10,000 జరిమానా .
► అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ ఫైలింగ్: 2019-2020, AY 2020-21కి సంబంధించిన అప్‌డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్‌ను 31 మార్చి 2023 లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసాక ఫైల్ చేయలేరు.
ముందస్తు పన్ను చెల్లింపు: రూ. 10,000 కంటే  పన్ను చెల్లించాల్సి ఉ‍న్న  చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అయితే, మూలధన లాభాలు వంటి అదనపు ఆదాయం ఉన్నా, ఉద్యోగాన్ని మార్చుకున్నా మీరు ముందస్తు పన్నును లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది.
2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే, మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, నెక్ట్స్‌ ఐటీఆర్‌ వరకు  బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, అత్యధిక పరిమితి రూ. 1.5 లక్షలతో పన్ను మినహాయింపును  క్లెయిమ్ చేయవచ్చు. 
పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి: పీపీఎఫ్‌ సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్‌డ్ డిపాజిట్ ,ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు  ప్రయోజనాలను పొందవచచ్చు
ఫారమ్ 12బీ:  ఉద్యోగం మారినట్టయితే  వారు ఫారమ్ 12B పూరించడాన్ని  మర్చిపోవద్దు.
మ్యూచువల్ ఫండ్ నామినేషన్: సెబీ సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతా బంద్‌ అవుతుంది. 
మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31లోపు  NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ నంబర్ , ఇమెయిల్  ఐడీని ధృవీకరించుకోవడం అవసరం.
 క్యాపిటల్ గెయిన్: ఇంతకుముందు ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను రహితంగా ఉండేది.  ఈక్విటీ ఫండ్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా పన్ను రేటు 10 శాతం. సో..పెట్టుబడులను రీడీమ్ చేయాలనుకుంటే పన్ను రహిత పరిమితి రూ. 1 లక్ష ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మార్చి 31లోపు రిడీమ్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను  15 శాతం 
 ప్రధానమంత్రి వయ వందన యోజన: సీనియర్ సిటిజన్లు, రిటైర్‌ మెంట్‌ ఫండ్‌ కోసం ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి  పలు ఆప్షన్స్‌ ఉన్నాయి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు మార్చి 31, 2023 లోపు దీన్ని  ప్రారంభిస్తే మంచింది.  
 ఈ పాలసీలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద  10 సంవత్సరాల నిర్ణీత కాలానికి. రూ.9,250 నెలవారీ పెన్షన్ , రూ. 1.62 లక్షల కనీస పెట్టుబడిపై, నెలవారీ పెన్షన్ రూ. 1,000 వరకు వస్తుంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top