
హైదరాబాద్: ది కాంపౌండ్ లైవ్‌స్టాక్ ఫీడ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CLFMA) తన 58వ వార్షిక సాధారణ సమావేశం& 66వ జాతీయ సింపోజియంను 2025 ఆగస్టు 22, 23వ తేదీలలో హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో నిర్వహించనుంది.
“భారతదేశంలో పశువుల వ్యవసాయం - భవిష్యత్ మార్గం” అనే ఇతివృత్తంతో రెండు జరిగే ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు హాజరుకానున్నారు. భారతదేశంలోని పశువుల, పాడి, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ భవిష్యత్తుపై చర్చించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముందు CLFMA ఆఫ్ ఇండియా ఛైర్మన్, దివ్య కుమార్ గులాటి మాట్లాడుతూ.. భారతదేశం పాడి పరిశ్రమల రంగం చాలా అభివృద్ధి చెందుతోంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా దోహదపడుతోంది. భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. బలమైన విధానాలు, మరింత శక్తివంతమైన కోల్డ్-చైన్ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన ఆవిష్కరణలతో, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదగడానికి సిద్ధమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్ కూడా మాట్లాడారు.
ఏజీఎం & సింపోజియం.. భారతదేశ పశువుల, పాడి, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ రంగాల కోసం ఒక సామూహిక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే కాకుండా దేశాన్ని ఒక గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.