
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధి (ఐఈపీఎఫ్‌ఏ) నుంచి ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో ఐఈపీఎఫ్‌ఏ పనిచేస్తోంది. ఇన్వెస్టర్లలో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. క్లెయిమ్ చేసుకోని షేర్లు, డివిడెండ్‌లు, ఇతర మొత్తాలు ఐఈపీఎఫ్‌ఏకు బదిలీ అవుతాయి. వీటిని ఇన్వెస్టర్లు లేదా వారి వారసులు క్లెయిమ్ చేసుకుని తిరిగి పొందొచ్చు.
ఈ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను ప్రభుత్వం సడలించింది. నోటరీకి బదులు ఇన్వెస్టర్లు సొంతంగా అటెస్టేషన్ ఇస్తే సరిపోతుంది. రూ.5,00,000 లోపు షేర్ల విలువ ఉంటే వాటిని తిరిగి పొందేందుకు దినపత్రికలో ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. దీన్ని మినహాయించింది.