సిమ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం

check telcos new SIM card sale rules if found flouting Rs 10 lakh fine - Sakshi

 సిమ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా

న్యూఢిల్లీ: నమోదు చేసుకోని డీలర్ల ద్వారా సిమ్‌ కార్డులను విక్రయించి, కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని టెల్కోలను టెలికం శాఖ (డాట్‌) హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.  దీనికి ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయని, టెలికాం ఆపరేటర్లు సెప్టెంబర్ 30 లోపు అన్ని ‘పాయింట్ ఆఫ్ సేల్’ (PoS) నమోదు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది.

సిమ్‌ కార్డుల మోసపూరిత విక్రయాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు అన్ని పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ను (పీవోఎస్‌) సెప్టెంబర్‌ 30లోగా రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పీవోఎస్‌లు తగు పత్రాలను సమర్పించి, రిజిస్టర్‌ చేయించుకోవాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top