క్వెరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు కొంత తక్కువగా ఉండే ‘చాట్‌జీపీటీ గో’ను భారత్‌లోని యూజర్లకు ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమితం కాలం పాటు నిర్వహించే ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని పేర్కొంది.
భారత్‌లో తొలిసారిగా బెంగళూరులో నవంబర్ 4న డెవ్‌డే ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ సందర్భంగానే ఉచిత ఆఫర్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతమున్న సబ్‌స్క్రైబర్స్ అందరికీ కూడా ఏడాది ఉచిత ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. కాస్త అందుబాటు స్థాయి చార్జీలతో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించాలన్న యూజర్ల డిమాండ్ మేరకు చాట్‌జీపీటీ గోని ఓపెన్‌ఏఐ ఈ ఏడాది ఆగస్టులో భారత్‌లో ఆవిష్కరించింది.
ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు


