నేపాల్‌లో రిలయన్స్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌ | Campa Cola landed in Nepal Reliance partnered with Chaudhary Group | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో రిలయన్స్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌

Jul 15 2025 10:18 AM | Updated on Jul 15 2025 10:18 AM

Campa Cola landed in Nepal Reliance partnered with Chaudhary Group

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ ‘కాంపా కోలా’ను నేపాల్‌ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందుకోసం కంపెనీ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌), నేపాల్‌కి చెందిన చౌదరి గ్రూప్‌తో (సీజీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫుడ్, బెవరేజెస్‌ విభాగంలో క్యాంపా ఉత్పత్తుల తయారీ, దేశవ్యాప్తంగా పంపిణీకి సీజీ తోడ్పడుతుంది.

కాంపా పోర్ట్‌ఫోలియో కింద తొలుత కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్, కాంపా ఎనర్జీ గోల్డ్‌ బూస్ట్, కాంపా ఎనర్జీ బెర్రీ కిక్‌ ఉత్పత్తులను ప్రవేశపెడతారు. ప్రాంతీయంగా మరింత వృద్ధి సాధించే దిశగా దీర్ఘకాలిక విజన్‌తో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఆర్‌సీపీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేతన్‌ మోదీ తెలిపారు. తమ బెవరేజ్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సీజీ గ్రూప్‌ ఎండీ నిర్వాణ చౌదరి చెప్పారు. 

ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ నిధి విడుదలకు డేట్‌ ఫిక్స్‌?

2022లో కాంపా బ్రాండ్‌ను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. 2023లో దాన్ని దేశీ మార్కెట్లో సరికొత్తగా ప్రవేశపెట్టింది. అటు సీజీ గ్రూప్‌ అంతర్జాతీయంగా 200 పైగా కంపెనీలు, 260 పైచిలుకు బ్రాండ్లను నిర్వహిస్తూ నేపాల్‌లో అగ్రగామిగా నిలుస్తోంది. భారత్‌ సహా పలు దేశాల్లో అమ్ముడయ్యే ‘వై వై’ బ్రాండ్‌ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఈ సంస్థకు చెందినవే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement