
ప్రభుత్వ టెలికమ్ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారుల కోసం బైటీవీ ప్రీమియం ప్యాక్‌ను ప్రారంభించింది. డిజిటల్ వినోదాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 25 పైగా ఓటీటీలు, 450 పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని రూ .151 లకే అందిస్తోంది.
బైటీవీ ప్రీమియం ప్యాక్లో ప్రముఖ ఓటీటీ సేవలు ఉన్నాయి. జీ5, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, షెమారూమీ, సన్ ఎన్ఎక్స్టీ, డిస్కవరీ, ఎపిక్ ఆన్, ఈటీవీ విన్, చౌపాల్ వంటి ఓటీటీలు ఇందులో ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రాంతీయ కంటెంట్, లైవ్ టెలివిజన్‌ను వివిధ భాషలలో స్ట్రీమ్ చేయవచ్చు. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న బైటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు.
బైటీవీ ప్రీమియం ప్యాక్‌కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ఎలాంటి వ్యాలిడిటీని ధృవీకరించనప్పటికీ, రూ .151 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుందని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఇందులో అనేక పాపులర్ ఓటీటీ సర్వీసలు ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లను మాత్రం ఈ ఆఫర్‌లో చేర్చకపోవడం గమనార్హం.
2025 ఫిబ్రవరిలో ఉచిత పైలట్‌గా ప్రారంభమైన బైటీవీ ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెంది ఓటీటీ అగ్రిగేషన్ స్పేస్‌లో బీఎస్ఎన్ఎల్‌ను గట్టి పోటీదారుగా నిలబెట్టింది.
Stream 450+ Live TV Channels & 25+ OTTs with BSNL BiTV Premium Pack - All-In-One Entertainment at ₹151!
Get it now: https://t.co/0lA2HY4IOJ#BSNL #BSNLIndia #DigitalIndia #BiTV #Entertainment pic.twitter.com/VQ6e946dWx— BSNL India (@BSNLCorporate) August 28, 2025