స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి! | Black Monday Sensex Settles 1800 pts Lower and Nifty Ends Near 22500 | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి!

Mar 23 2026 6:41 PM | Updated on Mar 23 2026 7:17 PM

Black Monday Sensex Settles 1800 pts Lower and Nifty Ends Near 22500

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.

స్టాక్‌ల విషయానికొస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్‌క్యాప్100, నిఫ్టీ మిడ్‌క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement