చాలామంది వాహన ప్రేమికులు.. నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు తమ గ్యారేజిలో చేరుస్తూ ఉంటారు. ఇందులో కొత్త కార్లు మాత్రమే కాకుండా.. వింటేజ్ కార్లు కూడా ఉంటాయి. అత్యంత ఖరీదైన, అపురూపమైన కార్లను కలిగిన ప్రముఖుల జాబితాలో యోహాన్ పూనవల్లా కూడా ఉన్నారు. తాజాగా ఈయన కార్ గ్యారేజిలో 'టయోటా సుప్రా MKIV' చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో వైరల్ అవుతున్నాయి.
యోహాన్ పూనవల్లా కుమారుడు.. 'జయన్ పూనవల్లా' టయోటా సుప్రా MKIV పక్కన ఉన్న ఫోటోలను మిథున్ వెట్టత్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ కారును జయన్ డ్రైవ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని ఫోటోలలో ఈ కారు గ్యారేజిలో రోల్స్ రాయిస్, బెంట్లీ, జాగ్వార్ వంటి కార్ల పక్కన పార్క్ చేసి ఉండటం చూడవచ్చు.
టయోటా సుప్రా MKIV
టయోటా సుప్రా MKIV అనేది 1990ల నాటి అత్యంత ప్రసిద్ధ చెందిన స్పోర్ట్స్ కార్లలో ఒకటి. ఆటోమోటివ్ ఔత్సాహికులలో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇది మంచి పనితీరును అందించే కారు కావడంతో.. ఇప్పటికి కూడా ఈ కారుకు అభిమానులు చాలామందే ఉన్నారు. పూనవల్లా గ్యారేజిలో చేరిన ఈ కారును కొంత కష్టమైజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
యోహాన్ పూనవాలా కార్ల కలెక్షన్
యోహాన్ పూనవాలా గ్యారేజిలో.. భారతదేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWBతో పాటు మొత్తం 22 రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించిన రేంజ్ రోవర్ కూడా వీరి గ్యారేజిలో ఉంది. 2016లో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా & అతని భార్య కోసం అదే రేంజ్ రోవర్‌ను ఉపయోగించారు. సరికొత్త ఫ్లయింగ్ స్పర్, పాత ఫ్లయింగ్ స్పర్, అనేక వింటేజ్ బెంట్లీలతో సహా అనేక బెంట్లీ కార్లు వీరి వద్ద ఉన్నాయి.


