సైడ్‌ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న హీరోయిన్లు వీళ్లే!

Beautiful tollywood actress side business details in telugu - Sakshi

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ప్రకారం ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో కూడా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. మరో వైపు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి సినిమాల్లో నటిస్తూనే వ్యాపారాలు చేస్తున్న ముద్దుగుమ్మలెవరు, వారి బిజినెస్‌లు ఏమిటనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. 

కీర్తి సురేష్: 
నేను శైలజ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న మహానటి కీర్తి సురేష్ సినిమాల్లో మాత్రమే కాకుండా.. 'భూమిత్ర' అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతోంది. ఇది పూర్తిగా ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్దమైన ఔషధాలతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను చేసే బ్రాండ్.

కాజల్ అగర్వాల్:
లక్ష్మీ కల్యాణంతో కుర్రకారు మనసు దోచిన కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో పాపులర్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదిస్తున్న ఈ అమ్మడు తన చెల్లెలితో కలిసి మర్సాలా అనే జ్యువెలరీ ప్రారంభించి రెండు చేతుల్లోనూ సంపాదిస్తోంది.

శ్రియా శరణ్:
నాలుగు పదుల వయసులో కూడా ఏ మాత్రం చెరగని అందంతో సినీ ప్రపంచంలో తిరుగులేని గుర్తింపు పొందిన శ్రియా శరణ్ ‘శ్రీ స్పందన’ స్పా స్థాపించి అటు సినిమాల్లో ఇటు బిజినెస్ పరంగా కూడా బాగా సంపాదిస్తోంది. ఇది భారతదేశంలో ఉన్న ప్రముఖ స్పా కంపెనీలలో ఒకటి కావడం విశేషం.

ఇలియానా:
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తన కంటూ ఒక ప్రత్యేక క్రేజుని సంపాదించిన గోవా భామ ఇలియానా ప్రస్తుతం బిజినెస్ మీదనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తూ సక్సస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. అంతే కాకుండా ఈమె సొంతంగా డిజైన్ లేబుల్‌ నడుపుతున్నట్లు సమాచారం.

శృతి హాసన్:
రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన శృతి హాసన్ సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ రంగంలో కూడా తనదైన రీతిలో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఈమె ప్రొడక్షన్ హౌస్ షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్స్, వీడియో రికార్డింగ్‌ సంస్థతో బాగా ఆర్జిస్తోంది.

ప్రణీత సుభాష్:
అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ పొందిన హీరోయిన్స్‌లో ఒకరు ప్రణీత సుభాష్. బావా సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఈమె బెంగళూరులో ఒక రెస్టారెంట్ ప్రారంభించి, ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా రెస్టారెంట్ బ్రాంచిలను బాగా సంపాదిస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్:
కెరటం సినిమాతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన రకుల్.. కరెంటు తీగ మొదలైన సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు పొందింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు F45 ఫిట్నెస్ హెల్త్ హబ్ జిమ్ సెంటర్ ప్రారభించింది. ఫిట్ నెట్ విషయంలో ముందుండే రకుల్ ఈ జిమ్ సెంటర్లను ఇతర నగరాల్లో కూడా ప్రారంభించింది.

తమన్నా భాటియా:
100% లవ్ సినిమాతో అందరిని ఆకట్టుకుని బాహుబలి సినిమాతో మరింత ప్రత్యేక గుర్తింపు పొందిన మిల్క్ బ్యూటీ తమన్నా ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు 'వైట్ అండ్ గోల్డ్' పేరుతో జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించింది. 2015లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఇప్పటికి కూడా సజావుగా ముందుకు సాగుతోంది.

తాప్సీ పన్ను:
ఝుమ్మందినాదం సినిమాతో ముద్దు ముద్దుగా అలరించిన ఈ అందాల భామ చిన్న వయసునుంచే మోడలింగ్ రంగంలో గుర్తింపు పొందింది. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి అవకాశాలను పొందుతోంది. అంతే కాకుండా ఈమె  చెల్లి షాగన్, స్నేహితుడు ఫరాహ్హ్ తో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించి ఎంతోమంది సెలబ్రిటీలకు పెళ్లి చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top