నవంబర్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే ప్రకటించింది. ఇందులో వచ్చే వారంలో (3 నుంచి 9) నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ & మతపరమైన ఆచారాల ఆధారంగా సెలవులు నిర్ణయిస్తారు.
నవంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ & రహస్ పూర్ణిమ సందర్భంగా.. ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, నక్‌పూర్, కోల్‌కతా, రాంచీ, సిమ్లా మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 6 (గురువారం): బీహార్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలు 2025 కారణంగా పాట్నాలోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 7 (శుక్రవారం): వంగాల పండుగను పురస్కరించుకుని షిల్లాంగ్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 8 (శనివారం): బెంగళూరులో కనకదాస జయంతి జరుపుకుంటారు, కాబట్టి ఈ ప్రాంతంలోని బ్యాంకులకు సేవలు.
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.


