
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా ‘బీఓబీ యాస్పైర్ ఎన్‌ఆర్‌ఐ సేవింగ్స్ అకౌంట్’ ప్రవేశపెట్టింది. విదేశాలకు వెళ్లే ముందు, భారత్‌లోనే ఉన్నప్పుడే కస్టమర్లు బీఓబీ యాస్పైర్ ఎన్‌ఆర్‌ఈ సేవింగ్స్ అకౌంటు తెరవాలి. ఇలా తెరిచిన ఖాతా, తొలుత ‘ఇనాక్టివ్ మోడ్’లో ఉంటుంది.
ఖాతాదారులు తమ ఎన్నారై హోదాను ధృవీకరిస్తూ ఇమ్మిగ్రేషన్ స్టాంపుతో పాస్‌పోర్ట్ కాపీ, విదేశాల్లోని చిరునామా ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత ఖాతా పూర్తి స్థాయిలో యాక్టివ్‌గా మారుతుంది. ఈ అకౌంటుపై తొలి రెండు త్రైమాసికాల్లో ఎలాంటి కనీస బ్యాలెన్స్ చార్జీలు ఉండవు.
తదుపరి ప్రతి క్వార్టర్‌కు సగటున రూ.1,000 బ్యాలెన్స్ నిబంధన వర్తిస్తుంది. అకౌంటు బ్యాలెన్స్‌లో గరిష్ట పరిమితేమీ ఉండదు. ఖాతాపై వచ్చిన ఆదాయానికి, ఇన్‌కం టాక్స్ నుంచి, బ్యాలెన్స్‌లకు వెల్త్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఫెసిలిటీతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందించేలా కస్టమైజ్ చేసిన డెబిట్ కార్డు ఉంటుంది. భావి ప్రవాస భారతీయుల(ఎన్నారై) అవసరాలకు అనుగుణంగా ‘బీఓబీ యాస్పైర్ అకౌంట్’ను ప్రవేశపెట్టామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ తెలిపారు.