బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చిన కంపెనీలు

Bajaj, TVS and Royal Enfield Motorcycles Get Expensive - Sakshi

న్యూఢిల్లీ: బజాజ్, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనేవారికి భారీ షాక్ ఇచ్చాయి కంపెనీలు. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలో తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టీవీఎస్ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అపాచీ ధరలను పెంచగా, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్ వారి మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణి ధరలను పెంచాయి. ఈ కొత్త ధరలు జనవరి 2021 నుంచి తయారు చేయబడిన, విక్రయించే బైక్‌లు, స్కూటర్లపై పెంపు ధరలు వర్తిస్తాయని పేర్కొంది. టీవీఎస్ సంస్థ తన ప్రధాన మోటారుసైకిల్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలను రూ.3 వేలకు పెంచింది. ఈ మోటారుసైకిల్ ఇప్పుడు 2.48 లక్షల రూపాయల ధర వద్ద లభిస్తుంది.(చదవండి: బీఎండబ్ల్యూ కొత్త కారు అదిరిందిగా)

మరోవైపు, అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధరను రూ.2,000 పెరిగి 1.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ముంబై) లభిస్తుంది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1,770, ఆర్టీఆర్ 180, ఆర్టీఆర్ 160 ధరలు వరుసగా రూ.1770, రూ.1520 పెరిగాయి. బజాజ్ సంస్థ తన అవెంజర్ క్రూయిజర్ 220 ధరలను 3,521 రూపాయలు పెంచింది, ఇప్పుడు దీని ధర రూ .1.24 లక్షలు. మరోవైపు, డొమినార్ 400, డొమినార్ 250 ధరలను వరుసగా 3,480 మరియు 3,500 రూపాయలు వరకు పెంచారు. పల్సర్ 220ఎఫ్ ధరను రూ.3,500 పెంచడంతో అది రూ.1.25 లక్షలకు చేరుకుంది. ఎన్‌ఎస్‌160, ఎన్‌ఎస్‌ 200 ధరలను వరుసగా రూ.3,000, రూ.3,500 పెంచినట్లు కంపెనీ ప్రకటించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఆర్ఈ క్లాసిక్ 350 ధరలను సుమారు రూ.2,000 పెంచారు. ఈ శ్రేణి ఇప్పుడు రూ.1.63 లక్షలు నుంచి రూ.1.85 లక్షల ధరల‌లో లభిస్తుంది. బుల్లెట్ సిరీస్ ధరలు కూడా పెరగడంతో అవి ఇప్పుడు రూ.1.27 లక్షల నుంచి 1.43 లక్షల ధరల‌లో లభిస్తున్నాయి. క్లాసిక్, బుల్లెట్ బైక్స్ వంటి బైక్స్ ధర రూ.2 వేల వరకు పైకి చేరింది. అదే మెటిరో 350 ధర మాత్రం రూ.3 వేలు పెరిగింది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొనే వారికి ఝలక్ తగిలిందని చెప్పుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top