యాక్సిస్‌ కొత్త ఈటీఎఫ్‌ ఫండ్‌... రూ. 50 కోట్లు సమీకరణకు టార్గెట్‌

Axis Mutual Fund aims to raise Rs 50 crore from new ETF fund - Sakshi

ముంబై: దేశీయంగా ఏడో పెద్ద ఫండ్‌ హౌస్‌ యాక్సిస్‌ ఎంఎఫ్‌ కొత్త ఫండ్‌ ఆఫర్‌(ఎన్‌ఎఫ్‌వో)కు తెరతీస్తోంది. ఈ నెల 22న ఫండ్‌ ప్రారంభమైన ఫండ్,  ఏప్రిల్‌ 5న ముగియనుంది. ఈ ఎన్‌ఎఫ్‌వో(ఓపెన్‌ ఎండెడ్‌ ఎస్‌అండ్‌పీ 500 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌) ద్వారా కనీసం రూ. 50 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

ఇదీ చదవండి: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్‌ ముగియకముందే మేల్కొండి!

ఈ నిధులను ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌లు)లో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఫండ్‌ను వినాయక్‌ జయంత్‌ నిర్వహించనున్నారు. అలాట్‌మెంట్‌ తేదీ నుంచి 30 రోజుల్లోగా రిడీమ్‌ లేదా స్విచ్‌డ్‌ ఔట్‌ అయితే 0.25 శాతం ఎగ్జిట్‌ లోడ్‌ విధిస్తారు.

ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా  కంపెనీలకు అప్లై చేశాడు..  మొత్తానికి...

అలాట్‌మెంట్‌ అయ్యాక 30 రోజుల్లోగా రిడీమ్‌ లేదా స్విచ్‌డ్‌ ఔట్‌ అయితే ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ అమలుకాదని ఫండ్‌ హౌస్‌ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రాఘవ్‌ అయ్యంగర్‌ పేర్కొన్నారు. వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేపట్టే ఇతర రెగ్యులర్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాదిరికాకుండా ఈ ఫండ్‌ సొంత పథకాలు లేదా ఇతర ఫండ్‌ హౌస్‌ పథకాలలో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఆఫ్‌షోర్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అయితే యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top