
యాపిల్ కంపెనీ తన 'అవే డ్రాపింగ్' ఈవెంట్‌ను మంగళవారం (సెప్టెంబర్ 9) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్ కొత్త వెర్షన్‌లు, అప్డేటెడ్ ఎయిర్‌పాడ్‌లతో పాటు.. వివిధ రకాల యాక్ససరీస్ కూడా ఆవిష్కరించనుంది.
యాపిల్ త్వరలో నిర్వహించనున్న ఈవెంట్‌లో.. ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ ఐఫోన్ 17 అనే నాలుగు వేరియంట్‌లను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి, థర్మల్ కెమెరా ఇమేజ్ లాగా స్టైల్ చేసిన లోగో షేర్ చేశారు. కంపెనీ రాబోయే కొత్త ఐఫోన్ గురించి అధికారికంగా వెల్లడించకపోయినా.. కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
చాలా సంవత్సరాల తరువాత.. యాపిల్ కంపెనీ మొదటిసారి అప్డేటెడ్ ఐఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది మునుపటి ఐఫోన్ కంటే 5.5 మిల్లీమీటర్లు సన్నగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇటీవల విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే కూడా సన్నగా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6 ఇంచెస్ స్క్రీన్ కూడా ఉండనున్నాయి. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇదీ చదవండి: సముద్ర గర్భంలో కేబుల్స్ కట్: ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
విడుదలకు సిద్దమవుతున్న యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ రెండు కొత్త రంగుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్ రంగుల కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధరలు రూ. 89,900 నుంచి రూ. 1.64 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ సమయంలో ధరలు అధికారికంగా వెల్లడవుతాయి.
Join us for a special Apple Event on September 9 at 10 a.m. PT.
Tap the ❤️ and we’ll send you a reminder on event day. pic.twitter.com/o5sI2sdkwO— Apple (@Apple) August 26, 2025