
గత నెలలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. కాగా ఇప్పుడు టెక్ దిగ్గజం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌పై దృష్టి సారించింది. అయితే ఈ కొత్త ఫోనుకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కొన్ని లీక్ అయ్యాయి. యాపిల్ కంపెనీ తన తదుపరి ఐఫోన్‌లో ఏమి అందిస్తుందని ఇక్కడ తెలుసుకుందాం.
ఐఫోన్ 18 ప్రో మాక్స్.. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మోడళ్లతో పోలిస్తే కొంచెం చిన్న డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉండనుంది. రియర్ డిజైన్ కొంత అప్డేట్ పొందుతుంది.. కానీ కెమెరా ప్లేస్‌మెంట్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఉంటుంది. మెరుగైన థర్మల్ నిర్వహణకు సహాయపడటానికి ఆపిల్ కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగించనుంది. డిస్ప్లే పరిమాణాల విషయానికొస్తే.. ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచెస్, ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ పొందనున్నట్లు సమాచారం.
కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో మాక్స్ 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌కు.. వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. రీడిజైన్ కెమెరా కంట్రోల్ బటన్ రానుంది. వేగవంతమైన పనితీరు, మెరుగైన శక్తి సామర్థ్యం కోసం ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
సాధారణంగా ఎప్పుడూ యాపిల్ కంపెనీ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది. కాబట్టి ఐఫోన్ 18 సిరీస్ కూడా అప్పుడే (2026 సెప్టెంబర్) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర.. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: తక్కువ ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్