breaking news
latest smartphones
-
ఐఫోన్ 17 వివరాలు లీక్!.. ధర ఎంతంటే?
యాపిల్ కంపెనీ తన 'అవే డ్రాపింగ్' ఈవెంట్‌ను మంగళవారం (సెప్టెంబర్ 9) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్ కొత్త వెర్షన్లు, అప్డేటెడ్ ఎయిర్‌పాడ్‌లతో పాటు.. వివిధ రకాల యాక్ససరీస్ కూడా ఆవిష్కరించనుంది.యాపిల్ త్వరలో నిర్వహించనున్న ఈవెంట్లో.. ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ ఐఫోన్ 17 అనే నాలుగు వేరియంట్లను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి, థర్మల్ కెమెరా ఇమేజ్ లాగా స్టైల్ చేసిన లోగో షేర్ చేశారు. కంపెనీ రాబోయే కొత్త ఐఫోన్ గురించి అధికారికంగా వెల్లడించకపోయినా.. కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.చాలా సంవత్సరాల తరువాత.. యాపిల్ కంపెనీ మొదటిసారి అప్డేటెడ్ ఐఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది మునుపటి ఐఫోన్ కంటే 5.5 మిల్లీమీటర్లు సన్నగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇటీవల విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే కూడా సన్నగా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6 ఇంచెస్ స్క్రీన్ కూడా ఉండనున్నాయి. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: సముద్ర గర్భంలో కేబుల్స్ కట్: ఇంటర్నెట్ సేవలకు అంతరాయంవిడుదలకు సిద్దమవుతున్న యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ రెండు కొత్త రంగుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్ రంగుల కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధరలు రూ. 89,900 నుంచి రూ. 1.64 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ సమయంలో ధరలు అధికారికంగా వెల్లడవుతాయి.Join us for a special Apple Event on September 9 at 10 a.m. PT. Tap the ❤️ and we’ll send you a reminder on event day. pic.twitter.com/o5sI2sdkwO— Apple (@Apple) August 26, 2025 -
రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లు
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. లేటెస్ట్గా విడుదలైన రూ.10,000 లోపు ధర(ధరలు రిటైలర్ను అనుసరించి మారే అవకాశం ఉంటుంది) ఉన్న కొన్ని 5జీ మొబైళ్ల గురించి తెలుసుకుందాం.పోకో సీ75 5జీ - రూ.9,499స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5160 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.74 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ25వాట్ ఛార్జింగ్రెడ్మీ ఏ4 5జీ - రూ.8,999మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ 5జీ - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్64 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ33వాట్ ఛార్జింగ్పోకో ఎం7 5జీ - రూ.8,799స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్6.88 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5160 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్రెడ్మీ 14సీ 5జీ - రూ.9,499మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ - రూ.8,499మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ25వాట్ ఛార్జింగ్ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ-రూ.7,999యూనిసోక్ టీ765 ప్రాసెసర్6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్13 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్లావా షార్క్ 5జీ - రూ.7,999యూనిసోక్ టీ765 ప్రాసెసర్6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్13 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్లావా బోల్డ్ ఎన్1 ప్రో - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్నోట్: మార్కెట్లో రూ.10వేలులోపు మరెన్నో మొబైళ్లు ఉన్నాయి. పైన తెలిపిన మోడళ్ల వివరాలు కేవలం ఒక అంచనాకు మాత్రమే తెలియజేశాం. కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.