కొంపముంచుతున్న ఎయిర్‌ ట్యాగ్స్‌, యాపిల్‌పై మహిళల పరువు నష్టం దావా!

Apple Inc Has Been Sued By Two Women Who Said Its Airtag Devices - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌పై ఇద్దరు మహిళలు పై పరువునష్టం దావా వేశారు. యాపిల్‌ సంస్థకు చెందిన ఎయిర్‌పాడ్‌ డివైజ్‌ సాయంతో వారి మాజీ  భాగస్వాములు తమను సులభంగా గుర్తు పట్టేస్తున్నారని చెప్పారు.  

శాన్‌ ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ కోర్టుకు ఇద్దరు మహిళలు ‘క్లాస్‌’ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో యాపిల్‌ సంస్థ ఏప్రిల్‌ 2021లో స్టాకర్‌ ఫ్రూఫ్‌ అనే డివైజ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 

ఆ డివైజ్‌ ముఖ్య ఉద్దేశం.. యాపిల్‌కు చెందిన ఎయిర్‌ ట్యాగ్‌ సాయంతో అనుమానాస్పద వ్యక్తులు.. మహిళలు లేదంటే, వారికి కావాల్సిన వారిని గుర్తించకుండా సంరక్షిస్తుంది. కానీ అదే విషయంలో యాపిల్‌ సంస్థ తమని మోసం చేసిందని, తాము ఎక్కడున్నా ఎయిర్‌ ట్యాగ్‌తో మాజీ ప్రియులు  సులభంగా గుర్తిస్తున్నట్లు కోర్టుముందు వాపోయారు. 

ఈ సందర్భంగా పిటిషనర్లు.. కొందరు వ్యక్తులు నేరపూరిత లేదా హానికరమైన ప్రయోజనాల కోసం ఎయిర్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారని... ఈ సంవత్సరం అక్రోన్, ఒహియో, ఇండియానాపోలిస్ ప్రాంతాల మహిళల హత్యలకు ఈ యాపిల్‌ ప్రొడక్ట్‌లకు సంబంధం ఉందని చెప్పారు.

నష్టపరిహారం చెల్లించాల్సిందే
మహిళ దాఖలు వ్యాజ్యంలో ఎయిర్‌ట్యాగ్‌ ద్వారా ట్రాక్‌ చేసిన ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు యాపిల్‌ నష్ట పరిహారం చెల్లించాలని, లేదంటే సంస్థ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్‌ ట్యాగ్స్‌ దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చిందంటూ గతంలో యాపిల్‌ చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎదుట హైలెట్‌ చేశారు. మరి ఈ కేసు విషయంపై యాపిల్‌ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? బాధిత మహిళలకు నష్టపరిహారం చెల్లిస్తుందా? లేదా? అని తెలియాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top